‘సలార్’ కోసం ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ !

‘సలార్’ కోసం ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ !

Published on May 9, 2021 9:14 PM IST

యాక్షన్ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ – నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమా “సలార్”. ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు, ఈ చిత్రం గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ గాసిప్ ఏమిటంటే.. ఈ చిత్రంలో ప్రభాస్‌ ను డ్యూయెల్ రోల్స్ లో కనిపిస్తాడని.. ఇది చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ప్రభాస్ యంగ్ గెటప్ లో అలాగే ఓల్డ్ గెటప్ లో కూడా కనిపిస్తాడట.

ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం మరో హీరోయిన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో షూట్ చేస్తారట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీలో హీరోయిన్ గా చేసినా శ్రీనిధి శెట్టినే ఈ సాంగ్ లో నటించబోతుంది అంటూ ఇప్పటికే రూమర్స్ వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు