‘చిరంజీవి’ 150వ చిత్రంలో హైలెట్ గా నిలవనున్న డ్యాన్సులు !

11th, August 2016 - 12:34:47 PM

prabhudeva-lawrence
‘రామ్ చరణ్’ నిర్మాణంలో ‘మెగాస్టార్ చిరంజీవి’ చేస్తున్న 150వ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని అన్ని అంశాలపై చిరంజీవి ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు తెలుస్తోంది. అభిమానులు తన నుండి ఆశించే డ్యాన్సుల విషయంలో వారిని ఏమాత్రం నిరుత్సాహపరచకూడదని చిరు బాగా కష్టపడుతున్నారట.

అంతేగాక గతంలో ఆయనకు మంచి పేరు తెచ్చిన అనేక పాటలకు నృత్య దర్శకత్వం వహించిన ప్రముఖ కొరియోగ్రాఫర్స్ ‘ప్రభుదేవా, రాఘవా లారెన్స్’ లు ఈ చిత్రం కోసం పనిచేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రభుదేవా ఒక పాటకు, లారెన్స్ మరొక పాటకు కొరియోగ్రఫీ చేస్తారని, ఈ రెండు పాటలు అభిమానులను అలరించేలా ఉంటాయని అంటున్నారు. కానీ ఈ విషయంపై మెగా క్యాంప్ నుండి ఎటువంటి అధికారిక సమాచారమూ అందలేదు. ఇకపోతే ‘వినాయక్’ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘కాజల్’ హీరోయిన్ గా నటిస్తోంది.