హిందీలోకి డ్రాగన్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

హిందీలోకి డ్రాగన్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Published on Mar 10, 2025 9:00 AM IST

dragon

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన సినిమా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ‘ఓరి దేవుడా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా రెండు చోట్లా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు హిందీలో విడుదల కాబోతుంది.

మరి తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో విజయం సాధించినట్లుగానే.. హిందీలో కూడా ఈ చిత్రం విజయాన్ని సాధిస్తోందేమో చూడాలి. కాగా హిందీలో ఈ సినిమా ఇప్పుడు మార్చి 14, 2025న బాలీవుడ్‌లో విడుదల కాబోతుంది. ప్రేమ, కాలేజ్ జీవితం, కాలేజ్ తర్వాత విద్యార్థుల జీవితాలు వంటి అనేక ఇతివృత్తాలతో కూడిన చిత్రం ఇది. పైగా ఈ సినిమా పూర్తిగా లవ్, రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. అందుకే, హిందీలో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు