LIK: హీరోకి రెమ్యునరేషన్ ఇవ్వలేదా? ప్రదీప్ రంగనాథన్ సినిమా వాయిదా.. కారణం అదేనా?

LIK: హీరోకి రెమ్యునరేషన్ ఇవ్వలేదా? ప్రదీప్ రంగనాథన్ సినిమా వాయిదా.. కారణం అదేనా?

Published on Mar 26, 2026 3:00 PM IST

LIK

కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రదీప్ హీరోగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హీరోకి ఇవ్వాల్సిన పారితోషికం విషయంలో తలెత్తిన వివాదమే ఈ వాయిదాకు కారణమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రదీప్ రంగనాథన్‌కు సంబంధించిన బకాయిలు ఇంకా క్లియర్ చేయలేదని, అందుకే ప్రమోషన్స్ కూడా ముందుకు సాగడం లేదని సమాచారం. ఈ వివాదం కారణంగానే ప్రదీప్ సైలెంట్‌గా తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమాను ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది. మొదట దీపావళికి ప్లాన్ చేశారు. ఆ తర్వాత డిసెంబర్, ఆపై వాలెంటైన్స్ డే.. ఇలా చాలాసార్లు డేట్లు మార్చారు. ఫైనల్‌గా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ సమస్యతో ఏప్రిల్ రిలీజ్ కూడా కష్టమే అనిపిస్తోంది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె. సూర్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

‘LIK’ పదే పదే వాయిదా పడుతుండటంతో ఇతర తమిళ సినిమాల రిలీజ్ డేట్స్ పై కూడా దీని ప్రభావం పడుతోంది. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియక మిగతా ప్రొడ్యూసర్లు తమ సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ బకాయిల వ్యవహారం ఎప్పటికి తేలుతుంది? ప్రదీప్ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే దానిపై మేకర్స్ నుంచి అఫీషియల్ క్లారిటీ వస్తే కానీ అభిమానుల టెన్షన్ తీరేలా లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు