
గత కొద్ది వారాల క్రితం డైరెక్టర్స్ అసోషియేషన్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై ఆగ్రహానికి గురవడంతో అతన్ని దాదాపు తెలుగు సినిమాల నుండి బాన్ చేసారు. ఈ వార్త మీడియాకి లీకవ్వడంతో చాలా మంది డైరెక్టర్స్ కూడా ప్రకాష్ రాజ్ బిహేవియర్ పట్ల తన బాధని వ్యక్తపరిచారు.
కానీ ప్రస్తుతం ఆ ప్లాన్స్ అన్నిటినీ కాన్సల్ చేసారు. అలాగే ఆతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని, ఇకనుండి ఎప్పటిలానే ప్రకాష్ రాజ్ తెలుగు సినిమాలు చేసుకోవచ్చని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీనియర్ నిర్మాతల మండలి డైరెక్టర్స్ యూనియన్ తో మాట్లాడి సెట్ చేసారు. మహేష్ బాబు నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ లో జరిగిన ఓ సంఘటన వలన ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ కంప్లైంట్ చేసారు.

