షూట్ లో తీవ్ర గాయాల పాలైన ప్రకాష్ రాజ్..కానీ.!

Published on Aug 10, 2021 3:34 pm IST

మన దక్షిణాది సినిమాలో పలువురు విలక్షణ స్టార్ నటులలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరని తెలిసిందే. తనదైన నటనతో ప్రకాష్ రాజ్ సాలిడ్ పత్రాలు పోషిస్తూ అన్ని భాషల్లో కూడా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఓ షూట్ లో గాయాలపాలయ్యినట్టుగా తెలిసింది.

మరి దీనిపై అసలు వివరాల్లోకి వెళితే తమిళ్ లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాకి గాను ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తుండగా ఈ సినిమాలో ఈరోజు జరిగిన షూట్ లో ప్రకాష్ రాజ్ తీవ్ర గాయాలు పాలయ్యినట్టు తెలిసింది.

అయితే ఈ ప్రమాదం పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ తనకి గాయం అయ్యింది చిన్న ఫ్రాక్చర్ కానీ ఎలాంటి ప్రమాదం లేదని హైదరాబాద్ తన ఫ్రెండ్ డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకి సర్జరీ కోసం వెళ్తున్నానని తెలిపి ఎవరు కంగారు పడక్కర్లేదు అని తన ఫాలోవర్స్ కి ఈ ఘటనపై ఒక క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :