“నావెంట పడుతున్న చిన్నాడెవడమ్మా” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన ప్రకాష్ రాజ్

Published on Jul 26, 2021 8:00 am IST

ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ లో నిర్మించిన తాజా చిత్రం నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా. ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ మేరకు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, ఈ చిత్రం టైటిల్ తన మనసుకు చాలా నచ్చిందని ప్రశంసించారు. ఈ చిత్రంతో నూతన పరిచయం అవుతున్న వాళ్లందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని కొనియాడారు. ఇలాంటి మంచి చిత్రంకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు.

అయితే దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ, ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా తన చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక తనను నమ్మి దర్శకుడు గా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు.

నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ, మేము నిర్మించిన చిత్రం ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడి మనసుకు నచ్చడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంతో ఇంకో ప్రత్యేకత చెబుతూ దర్శకుడిని, హీరోని, హీరోయిన్ ను తొలి పరిచయం మా సంస్థ నుండి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం లో హుషారు ఫేం గని కృష్ణ తేజ్, అఖిల ఆకర్షణ, తనికెళ్ళ భరణి, జీవా, జోగి బ్రదర్, అనంత్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :