సినీ”మా” బిడ్డలు…ప్రకాష్ రాజ్ ప్యానల్ మెంబర్స్ వీరే!

Published on Sep 3, 2021 6:01 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో మా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యం లో ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించడం జరిగింది. అందులో అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ ఉండగా, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, నటి హేమ, బెనర్జీ లు ఉన్నారు. జీవిత రాజశేఖర్ జనరల్ సెక్రెటరీ గా ఉండగా, ఉత్తేజ్ మరియు అనిత చౌదరీ లు జాయింట్ సెక్రటరీ లు గా ఉన్నారు. ట్రెజరర్ గా నటుడు నాగినీడు ను నిలబెట్టినట్లు ప్రకటించడం జరిగింది.

ఇందులో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గా 18 మందిని చేర్చడం జరిగింది. అందులో అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ఈటివి ప్రభాకర్, గోవింద రావు, ఖయ్యుం, కౌశిక్, ప్రగతి, రమణ రెడ్డి, శ్రీధర్ రావు, శివ రెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు. డి, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్ లు ఉన్నారు. ఈ సారి ఎన్నికలు మరింత ఆసక్తి కరంగా మారాయి.

సంబంధిత సమాచారం :