ఎలక్షన్లు ఎప్పుడు జస్ట్ ఆస్కింగ్ అంటున్న ప్రకాశ్ రాజ్..!

Published on Jul 7, 2021 1:42 am IST


సీనియర్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ‘మా’ అధ్యక్ష ఎన్నికలో తాను పోటీ చేస్తున్నట్టు తెలిపి ఇటీవల తన ప్యానెల్‌ను కూడా ప్రకటించాడు. అయితే ఎన్నికలు సెప్టెంబర్‌లో ఉంటే అప్పుడే ప్రకాశ్ రాజ్ ఎన్నికలకు సిద్దమై ప్యానల్‌ను ప్రకటించడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అని, హిందూ వ్యతిరేకి అంటూ ఆయనపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదంతా పక్కనపెడితే ప్రకాశ్ రాజ్ ఎల‌క్ష‌న్స్ ఎప్పుడు? #JustAsking అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి ట్విట్టర్‌లో తాజాగా ఓ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు ప్రకాష్ రాజ్‌కి జలక్ ఇచ్చేలా కామెంట్లు చేస్తున్నారు. ఏ ఎలక్షన్స్? మా ఎన్నికలా? లోక్ సభ ఎన్నికలా? అసెంబ్లీ ఎన్నికలా? మోడీ హయాంలో రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలా? వేటి గురుంచి అడుగుతున్నావని కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరేమో బెంగుళూరులో పోటీ చేసి డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన ఎల‌క్ష‌న్ల గురించా అని సెటైర్లు వేస్తుంటే, ఇంకొందరేమో నువ్వు జాతివ్య‌తిరేక శ‌క్తివి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ప్రకాశ్ రాజ్ ఈ ప్రశ్నకు ఎవరి నుంచి సమాధానం ఆశించి సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడో తెలీదు కానీ నెటిజన్ల నుంచి మాత్రం తలతిక్క సమాధానాలన్ని వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :