విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు గల వ్యక్తి. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఈ నటుడిని కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారనే విషయం ఎక్కువ శాతం మంది ప్రేక్షకులకు తెలియదు.
బాలచందర్ దర్శకత్వం వహించిన ‘డ్యూయెట్’ సినిమా ద్వారా ప్రకాష్ రాజ్ నటుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాలో తన నటన అందరిని ఆకట్టుకున్నారు. గురువుగారి ఆరోగ్యం బాగోకపోవడంతో గత రాత్రి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, బాగానే కోలుకుంటున్నారని చెప్పారు.
బాలచందర్ పోరాట పటిమ గల వ్యక్తి. ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థన చేయమని అభ్యర్థించారు. చెన్నైలో కావేరి ఆస్పత్రిలో జాయిన్ చేసిన తర్వాత నిపుణుడు వైద్యుల పర్యవేక్షణలో ఐసియులోనే బాలచందర్ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక పుకార్లు రావడంతో వైద్యులు హెల్త్ బులెటిన్లు జారీ చేశారు.


