పవన్ తో కోర్ట్ లో పోరుకు దిగేది అతనే..!

Published on Feb 26, 2020 12:26 am IST

పవన్ రీ ఎంట్రీ మూవీ పింక్ రీమేక్ విడుదలకు దగ్గరపడుతుంది. మే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. దీనితో దర్శకుడు వేణు శ్రీరామ్ త్వరగా షూటింగ్ ముగించే పనిలో ఉన్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. పింక్ రీమేక్ లో పవన్ లాయర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సెకండ్ హాఫ్ మొత్తం కోర్ట్ రూమ్ డ్రామా సన్నివేశాలతోనే నడుస్తుంది. ఐతే ఈ సన్నివేశాలలో పవన్ నటుడు ప్రకాష్ రాజ్ తో పోరాడతాడట. పవన్ క్లయింట్స్ వ్యతిరేక వర్గానికి చెందిన లాయర్ గా ప్రకాష్ రాజ్ నటింస్తుండగా వీరి మధ్య కోర్ట్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం.

ఇక దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కి జంటగా నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. పవన్ మరో వైపు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.

సంబంధిత సమాచారం :