“కేజీఎఫ్ చాప్టర్2” రిలీజ్ డేట్ పై ప్రశాంత్ నీల్ ట్వీట్!

Published on Jul 6, 2021 10:01 pm IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరో గా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి సెన్సేషన్ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి కొనసాగింపు గా వస్తున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ చిత్రం విడుదల కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే దీని పై తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ట్వీట్ చేశారు.

హాల్ నిండా గ్యాంగ్ స్టర్లు ఉన్నప్పుడు మాత్రమే మాన్ స్టర్ వస్తాడు అని, అతను వచ్చే కొత్త తేదీ ను త్వరలో ప్రకటిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ తో నే సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా వ్యూస్ మరియు లైక్స్ తో టాప్ లో నిలిచింది. ఈ చిత్రం లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర లో నటిస్తున్నారు. బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు, సౌత్ ఇండియా కి చెందిన పలువురు ప్రముఖులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :