నా మొదటి హీరో అంటూ ప్రశాంత్ నీల్ సరికొత్త పోస్ట్!

Published on Dec 17, 2021 11:01 pm IST

కేజీఎఫ్ చిత్రం తో దేశ వ్యాప్తంగా పేరు పొందిన దర్శకుడు ప్రశాంత్ నీల్. సౌత్ ఇండియా ను మాత్రమే కాకుండా, నార్త్ ఇండియా ను కూడా ఈ చిత్రం తో షేక్ చేశారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ చిత్రం తో బిజీగా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియా వేదిక గా ప్రశాంత్ నీల్ ఒక పోస్ట్ చేశారు. నా మొదటి హీరో, నా మొదటి గ్యాంగ్స్టర్, నా మొదటి ప్రేమ మురళి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 వచ్చే ఏడాది విడుదల కానుంది. పాండెమిక్ కారణం గా వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :