అందరికీ అందుబాటులో ప్రశాంత్ నీల్.. అందుకే డిమాండ్

Published on May 25, 2021 9:16 pm IST

ప్రజెంట్ ఒక హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలంటే వినిపించే దర్శకుల పేర్లలో ప్రశాంత్ నీల్ పేరు కూడ ఒకటి. స్టార్ హీరోలంతా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మాతలు ఎవరైనా ప్రశాంత్ నీల్ డేట్స్ ఉన్నాయని వస్తే తప్పకుండా సినిమాకు ఒప్పేసుకుంటున్నారు. అలా ఉంది ప్రశాంత్ నీల్ డిమాండ్. ఆయన డైరెక్ట్ చేసిన ‘కెజిఎఫ్ 2’ త్వరలోనే రిలీజ్ కానుంది. సినిమా మీద నేషనల్ లెవల్లో హైప్ ఉంది. అది కాకుండా ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే చిత్రం చేస్తున్నారు.

ఈ స్థాయిలో ఉన్న డైరెక్టర్ ఎవరైనా సరే కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ పుచ్చుకుంటారు. తక్కువలో తక్కువ 20 కోట్లు ఛార్జ్ చేస్తారు. హీరోలతో సమానంగా పారితోషకం తీసుకునే డైరెక్టర్లు చాలామందే ఉన్నారు. కానీ ప్రశాంత్ నీల్ అలా కాదు. పారితోషకం విషయంలో ఆయన నేల మీదే ఉన్నారట. మిగతా దర్శకుల్లా ఇరవై, పాతిక అనట్లేదట. భరించగల అమౌంటే చెబుతున్నారట. అందుకే నిర్మాతలు చాలామంది ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రశాంత్ నీల్ కు అంత డిమాండ్ ఏర్పడడానికి అందుబాటులో ఉన్న ఆయన రెమ్యునరేష్ కూడ ఒక ప్రధాన కారణమే. ఇకపోతే ‘సలార్’ పూర్తికాగానే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా సినిమాను మొదలుపెడతారు.

సంబంధిత సమాచారం :