మహేష్ కి కథ చెప్పబోతున్న హిట్ డైరెక్టర్ ?

Published on Oct 11, 2019 3:00 am IST

ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల‌ వసూళ్లు సాధించింది. దాంతో ప్రశాంత్ నీల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది.ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతోనా.. ఎన్టీఆర్‌తోనా అని. మొదట్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేస్తారని, ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. దాదాపు అవే కన్ఫర్మ్ అని అనుకున్నారంతా.

కానీ మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని ఇటీవలే కొత్త చర్చ మొదలైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రశాంత్ మహేష్ బాబుని మీట్ అవ్వనున్నారని, కథ చెప్పడానికే కలుస్తున్నాడని వార్తలొస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో కలవరం మొదలైంది. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ పూర్తై ప్రశాంత్ తెలుగు సినిమా మొదలుపెట్టేనాటికి వచ్చే యేడాది ఆఖరు అవుతుంది కాబట్టి ఈలోపు స్వయంగా ప్రశాంత్ నీల్ సినిమా ఎవరితో అని క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

సంబంధిత సమాచారం :

X
More