ప్రభాస్ మాస్ కటౌట్ ను ఒక లెక్కలో వాడనున్న నీల్.?

Published on May 23, 2021 10:54 am IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర తన లైనప్ తో సెన్సేషన్ ను నమోదు చేస్తున్న మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్. “కేజీయఫ్ చాప్టర్ 1” నుంచి లేటెస్ట్ ఎన్టీఆర్ చిత్ర వరకు ఒక్కో దానిపై ఒక్కో రకమైన అంచనాలు ఉన్నాయి. మరి అలా చేస్తున్న వాటిలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి.

భారీ అంచనాలు నమోదు చేసుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందో తన రోల్ పై వదిలిన పోస్టర్స్ చూస్తేనే అర్ధం అయ్యింది. మరి అలాంటి మాస్ దర్శకుడికి సాలిడ్ మాస్ పర్సనాలిటీ దొరికితే ఎలా ఉంటుందో నీల్ చూపించనున్నాడట.

ముఖ్యంగా అయితే యాక్షన్ సీక్వెన్స్ లలో ప్రభాస్ మాస్ చూస్తారని తెలుస్తుంది. అలాగే ప్రభాస్ తో ఒక సిక్స్ ప్యాక్ లుక్ లో ఓ సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసారని టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం ఈ మాస్ కాంబో మళ్ళీ ఇండియన్ వైడ్ మాస్ ఆడియెన్స్ కి గట్టి ట్రీట్ ఖాయంలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :