“కేజీయఫ్ 2″టీజర్ ఈ సీన్ పై యష్, నీల్ లకు నోటిస్ అట.!

Published on Jan 13, 2021 9:24 pm IST

లేటెస్ట్ సెన్సేషన్ “కేజీయఫ్ చాప్టర్ 2” టీజర్ ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో మనం చూసాం. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ డ్రామా నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్ ను మేకర్స్ వదిలారు. అన్ని భాషల్లో కలిపి ఒకే టీజర్ ను వదలగా దీనికి నెవర్ బిఫోర్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఎంతో సాలిడ్ ప్లాన్ చేసిన ఈ టీజర్ కు అన్ని భాషల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇదిలా ఉండగా ఈ టీజర్ లో ఓ సీన్ పై కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ వారు దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ మరియు నిర్మాత విజయ్ కు నోటీసు పంపించారట. మరి ఇంతకీ ఆ సీన్ ఏంటంటే రాకీ గన్ తో షూట్ చేసి వచ్చి ఆ వేడికి సిగరెట్ కాలుస్తాడు కదా..

ఆ సీన్ దగ్గర “యాంటీ స్మోకింగ్ వార్నింగ్” వార్నింగ్ ఎందుకు ఇవ్వలేదు అని వేసారట. రూల్ ప్రకారం అక్కడ వార్నింగ్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎందుకు ఇవ్వలేదని వారికి నోటిస్ పంపినట్టు తెలుస్తుంది. మరి ఈ అంశాన్ని మేకర్స్ త్వరగానే సెటిల్ చేసేస్తారని కూడా సమాచారం.

సంబంధిత సమాచారం :

More