మెగా హీరో బేర్ బాడీ ఫైట్ లు చేస్తున్నాడుగా ?

Published on Dec 14, 2019 12:40 am IST

సాయి ధరమ్ తేజ్ ఈ సారి ‘ప్రతిరోజూ పండుగే’ చిత్రంతో గట్టిగానే కొట్టేలా ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ అయిన మారుతీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో నడిచే పక్కా ఫ్యామిలీ ఎంటరైనర్ గా ప్రతిరోజూ పండుగే ఉండబోతుంది. అయితే ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్ తో పాటు యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. నేడు ప్రతిరోజూ పండుగే చిత్రం నుండి ధరమ్ తేజ్ కి సంభందించి కొన్ని పిక్స్ విడుదల కాగా.. వాటిలో ఆయన షర్ట్ లేకుండా ప్రత్యర్థులను వీర కుమ్ముడు కుమ్ముతున్నాడు. పైగా సిక్స్ ప్యాక్ బాడీ లో కాషాయ రంగు లుంగీ ధరించి ఉన్న సాయి తేజ్ మొత్తానికి కాక రేపుతున్నాడు. ఇలాంటి స్టిల్స్ మూవీపై ఇంకా అంచనాలు పెంచేస్తున్నాయి.

డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో సాయి తేజ్ కి జంటగా రాశి ఖన్నా నటిస్తోంది. ఆమె సినిమాలో ఏంజెల్ ఆర్నా అనే పక్కా గోదావరి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా థమన్ స్వరాలు సమకూర్చారు.

సంబంధిత సమాచారం :

More