ప్రతి రోజు పండుగే మొదటి రోజు నైజాం కలెక్షన్స్.

ప్రతి రోజు పండుగే మొదటి రోజు నైజాం కలెక్షన్స్.

Published on Dec 21, 2019 11:24 AM IST

prathiroju pandage

సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ప్రతిరోజూ పండుగే చిత్రం నిన్న విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. ఫన్ అండ్ ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్ నటన హైలెట్ గా నిలిచింది.మరి ఈ మూవీ మొదటి రోజు ఎంత వరకు రాబట్టింది అంటే…

డీసెంట్ టాక్ తో బాక్సాపీస్ ఓపెన్ చేసిన ప్రతిరోజూ పండుగే మొదటిరోజు నైజాంలో 1.25 కోట్ల షేర్ రాబట్టింది. ధరమ్ తేజ్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ మొత్తం రికార్డు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి పోటీగా విడుదలైన బాలకృష్ణ రూలర్ నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ మూవీ కలెక్షన్స్ కొంత మెరుగు కావచ్చు. కార్తీ దొంగ చిత్రం పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకున్నప్పటికీ డబ్బింగ్ మూవీ కావంతో అంతగా ప్రభావం చూపకపోవచ్చు. కాబట్టి ప్రతి రోజు పండుగే వసూళ్లు నేడు రేపు మరింత పెరగడం ఖాయం.

తాజా వార్తలు