మెగా హీరో రికవరీ బాగానే చేస్తున్నాడు

మెగా హీరో రికవరీ బాగానే చేస్తున్నాడు

Published on Dec 24, 2019 1:10 PM IST

prathiroju pandage

మెగా హీరో సాయి తేజ్ కొత్త చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ మొదటిరోజు నుండి డీసెంట్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.63 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం సోమవారం కూడా మంచి రన్ కనబర్చింది.

శుక్రవారం విడుదలైన ఇతర సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో సోమవారం కూడా ఈ చిత్రం మంచి షేర్ వసూలు చేయగలిగింది. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు 4వ రోజు ఈ సినిమా రూ.1.7 కోట్ల వరకు షేర్ అందుకుంది. దీంతో ఇప్పటివరకు థియేట్రికల్ బిజినెస్ నుండి 65 శాతం వరకు రికవరీ చేయగలిగింది. ఇక రేపు క్రిస్టమస్ కావడంతో వసూళ్లు ఇలాగే స్టడీగా కొనసాగే అవకాశం ఉంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు