‘ప్రతిరోజూ పండగే’ అక్కడ కూడా !

Published on Dec 13, 2019 8:52 pm IST

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా… మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం “ప్రతిరోజూ పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఆఫ్రికాలో కూడా రిలీజ్ కానుంది. ప్రైడ్ సినిమా వారు ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.

పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More