శనివారం పండగ చేసుకున్న ‘ప్రతిరోజూ పండగే’

శనివారం పండగ చేసుకున్న ‘ప్రతిరోజూ పండగే’

Published on Dec 22, 2019 6:33 PM IST

PrathiRojuPandaage

సాయి తేజ్, మారుతిల దర్శకత్వంలో రూపొందిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం మొదటిరోజే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.3.4 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు శనివారం బాగా పుంజుకుంది. ఎంతలా అంటే పూర్తిగా 80 నుండి 90 శాతం జంప్ కనబర్చింది.

తెలంగాణలో రెండో రోజు అత్యధికంగా రూ.2.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం సీడెడ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సైతం 90 శాతం పెరుగుదల చూపింది. మొత్తంగా రెండో రోజు వసూళ్లు చూస్తే 5.9 కోట్ల వరకు వచ్చాయి. మారుతి రాసిన కామెడీ సీక్వెన్సులు, రావు రమేష్ పెర్ఫార్మెన్స్, సత్యరాజ్ నటన, మంచి పాటలు వెరసి కుటుంబ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఈ వసూళ్లు ఇంకాస్త మెరుగయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు