ప్రీ లుక్ పోస్టర్ తో ఆసక్తి రేపుతున్న రవితేజ కొత్త ప్రాజెక్ట్.!

Published on Jul 1, 2021 10:45 am IST

మాస్ మహారాజ రవితేజ తనదైన జెట్ స్పీడ్ తో తన కొత్త సినిమాలను కంప్లీట్ చేసేస్తున్నారు. మరి ఇప్పుడు “ఖిలాడి” సినిమా ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉండగానే మరో నూతన దర్శకుడు శరత్ మందవను పరిచయం చేస్తూ తన 68వ సినిమాను అధికారికంగా ప్రకటించేసారు.

గత కొంత కాలం నుంచి ఆసక్తి రేపుతున్న ఈ ప్రాజెక్ట్ ను మేకర్స్ ఈరోజు నుంచే షూటింగ్ కూడా స్టార్ట్ చేసి ముహూర్తం ఖరారు చేశారు. మరి ఇదిలా ఉండగా ఇపుడు మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ను రవితేజపై డిజైన్ చేసి వదిలారు. మరి దీనిని పరిశీలిస్తే ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ డ్రామాలా ఉండనున్నట్టుగా తెలుస్తుంది.

మరి అలాగే అదే పోస్టర్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఓ ప్రమాణ స్వీకారం లెటర్ తదితర కీలక అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :