
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్రూస్ లీ సినిమా మరో ఐదురోజుల్లో పెద్ద ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఓ పక్క ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న రామ్ చరణ్, మరోపక్క తన తరువాతి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’ సినిమాను రామ్ చరణ్ తెలుగులో రీమేక్ చేయనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రీమేక్‌కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.
హీరో రామ్ చరణ్, నిర్మాత డీవీవీ దానయ్యలతో కలిసి సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ డిస్కషన్స్‌తో బిజీగా ఉన్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెలుగులో కొన్ని మార్పులు చేస్తున్నట్లు, అయితే అసలైన కథను మాత్రం ఏమాత్రం చెడగొట్టకుండా జెన్యూన్ రీమేక్‌గా సినిమాను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని రామ్ చరణ్ తెలిపారు. ఇక తమిళంలో అరవింద్ స్వామి చేసిన పాత్రను తెలుగులో ఎవరు చేయనున్నారనేది ఇంకా ప్రశ్నగానే మిగింది. మాధవన్, వివేక్ ఒబెరాయ్, సుధీప్ తదితరులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

