ప్రీ రిలీజ్ డేట్ కంఫర్మ్ చేసిన హ్యాపీ వెడ్డింగ్ టీం

ప్రీ రిలీజ్ డేట్ కంఫర్మ్ చేసిన హ్యాపీ వెడ్డింగ్ టీం

Published on Jul 17, 2018 3:22 PM IST


ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో సుమంత్ అశ్విన్‌. మెగా డాటర్ నిహ‌రిక కొణిదెల జంటగా నటించిన చిత్రం హ్యాపి వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని యువ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య తెరకెక్కిస్తున్నాడు.

ఈ నెల 21న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శక్తికాంత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటెర్టైనేమేంట్ గా రానున్న ఈ చిత్రాన్ని జులై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు