పలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ ఒక ఆసక్తి ఉంటుంది. అలా ఓ గ్రామీణ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రమే ‘ప్రేమకు జై’. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 11న (శుక్రవారం) థియేటర్‌లలో విడుదల అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ… ”పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత బాగా చేశారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఎంతో సహకరించారు. శుక్రవారం థియేటర్‌లలో విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.
అలాగే ఈ సినిమాలో దుబ్బాక భాస్కర్ విలన్ గా నటించగా ఈ చిత్రానికి ఎడిటర్: సామ్రాట్, సినిమాటోగ్రాఫర్: ఉరుకుందా రెడ్డి, సంగీతం: చైతు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం రాజేష్, సహ నిర్మాత: మైలారం రాజు, నిర్మాత: అనసూర్య, కథ – దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం లు సాంకేతిక విభాగంగా పని చేశారు.


