టాలీవుడ్ లో “ప్రేమలు” సెన్సేషన్ రికార్డ్!

టాలీవుడ్ లో “ప్రేమలు” సెన్సేషన్ రికార్డ్!

Published on Mar 18, 2024 1:54 PM IST

గిరీష్ A.D. దర్శకత్వంలో నస్లెన్ కే. గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేమలు (Premalu) చిత్రం మాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి, తెలుగు లో ఇటీవల థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. చిత్రంను దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు అయిన ఎస్ ఎస్ కార్తికేయ తెలుగు లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం గా ప్రేమలు నిలిచింది.

ఈ చిత్రం ఇప్పటి వరకూ 10.54 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. రోజురోజుకీ పెరుగుతున్న ప్రేమలు చిత్రం వసూళ్లు పై ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. దర్శక దిగ్గజం రాజమౌళి, మరియు అనిల్ రావిపూడి సినిమాను ప్రమోట్ చేయడం వసూళ్లను రాబట్టడం లో ప్లస్ అయ్యాయి. శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్ మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు