తెలుగులో “ప్రేమలు” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!?

తెలుగులో “ప్రేమలు” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!?

Published on Mar 20, 2024 11:30 AM IST


గిరీష్ A.D. దర్శకత్వంలో నస్లెన్ కే. గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేమలు (Premalu) చిత్రం మాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి, తెలుగు లో కూడా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంను ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు అయిన ఎస్ ఎస్ కార్తికేయ తెలుగు లో డిస్ట్రిబ్యూట్ చేయగా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళం చిత్రం గా ప్రేమలు నిలిచింది.

ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మార్చి 29 నుండి మలయాళం తో పాటుగా, తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్ మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు