దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం `ప్రేమెంత పనిచేసే నారాయణ`. అక్షిత కథానాయిక. ఝాన్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. జెఎస్ ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. యాజమాన్య సంగీతం అందించారు. అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 22న ప్రపంచ వ్యాప్తగా విడుదలవుతుంది. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్ సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన నటుడు శ్రీకాంత్ తొలి జ్ఞాపికని యాజమన్యకు అందించారు.
అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ, `శ్రీనివాసరావు మంచి టెక్నిషీయన్. వాళ్లబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ తనే అన్ని బాధ్యతలు తీసుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా ఫ్యాషన్ తోనే శ్రమించాడు. హరి లో మంచి జీల్ ఉంది. ఫ్యూచర్ లో మంచి నటుడు అవుతాడన్నా`రు.
చిత్ర హీరో హరికృష్ణ మాట్లాడుతూ, `రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉంటుంది. ఇదో పెయిన్ పుల్ స్టోరీ. ప్రేమకు కొత్త అర్ధం చెప్పే సినిమా. దర్శక, నిర్మాతలు తల్లిదండ్రులైనా చాలా ప్రొఫెషనల్ గా వ్వవహరించారు. ప్రేక్షకులంతా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ, `సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన మేజర్ చంద్ర కాంత్ తో పాటు చాలా సినిమాలకు పని చేసాను. తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాను. కథను నమ్మి చేసిన సినిమా ఇది. అల్లు అరవింద్ గారు సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. అని అన్నారు.
గంగారావు, రాహుల్ బొకాడియా, ఏఆర్ సి బాబు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశీ ప్రకాష్, ఎడిటింగ్: జానకి రామ్, స్ర్కీన్ ప్లే భూపతి రాజా, మరుధూరి రాజా, రాజేంద్ర కుమార్, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, నిర్మాత : సావిత్రి జొన్నలగడ్డ


