శరవేగంగా ‘ప్రేయసి రావే’ షూటింగ్

శరవేగంగా ‘ప్రేయసి రావే’ షూటింగ్

Published on Nov 4, 2025 8:30 AM IST

Preyasi

తొలి చిత్రం ‘ప్రేయసి రావే’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ చంద్ర, ఆ తర్వాత “అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, హనుమంతు” వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించారు. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం “పిఠాపురంలో” (ఉపశీర్షిక – అలా మొదలైంది) ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మహేష్ చంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు.

దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ.. “ఇది కుటుంబ భావోద్వేగాలతో మిళితమైన ప్రేమకథ. మూడు జంటల ప్రేమకథలతో పాటు ముగ్గురు తండ్రుల పెంపకంలోని లోటుపాట్లు చూపించాం. సినిమా మొత్తం ‘పిఠాపురం’ నేపథ్యంగా సాగుతుంది. పిఠాపురం, హైదరాబాద్‌, గోవాల్లో షూటింగ్ జరిపాం. మూడు పాటలు చాలా బాగా వచ్చాయి” అన్నారు.

అలాగే, “నా జీవితానికి దారి చూపిన డి. రామానాయుడు గారి స్ఫూర్తితో కథను నమ్మి ఎక్కడా వేస్ట్ లేకుండా సినిమా తీశాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం” అని తెలిపారు. ఈ చిత్రంలో డా. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన తారాగణంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు