టాక్.. ఓటిటిలో “గేమ్ చేంజర్” కి భారీ ధర ఇచ్చిన ప్రైమ్ వీడియో?

టాక్.. ఓటిటిలో “గేమ్ చేంజర్” కి భారీ ధర ఇచ్చిన ప్రైమ్ వీడియో?

Published on Mar 20, 2024 10:01 AM IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న అవైటెడ్ చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు దాదాపు పూర్తి కావస్తుండగా చిత్ర ఈ సినిమా ఓటిటి హక్కులు సంబంధించి నిన్ననే ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ప్రైమ్ వీడియోతో డీల్ కంప్లీట్ అయ్యింది. అయితే ఈ చిత్రానికి ప్రైమ్ వీడియో వారు భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

మరి వీటి ప్రకారం ఈ భారీ చిత్రానికి వారు 100 కోట్లకి పైగానే డీల్ ఇచ్చినట్టుగా వినిపిస్తుంది. దీనితో ఇది ఇండియన్ సినిమా దగ్గర క్రేజీ డీల్స్ లో ఒకటిగా నిలిచింది అని చెప్పాలి. ప్రస్తుతానికి ఇది అనధికారిక నెంబర్ కానీ అభిమానుల్లో కూడా ఇది వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే నిర్మాత దిల్ రాజు తమ నిర్మాణ సంస్థలో 50వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాదిలోనే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు