కొత్త రేట్స్ తో ‘ప్రైమ్ వీడియో’ బ్యాడ్ న్యూస్ – ‘నెట్ ఫ్లిక్స్’ గుడ్ న్యూస్.!

Published on Dec 14, 2021 12:00 pm IST

ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇపుడు ఓటిటి రంగం ఎంతలా అభివృద్ధి చెందుతూ వెళుతుందో తెలిసిందే. మరి ఈ రంగంలో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థలు ఏవన్నా ఉన్నాయి అంటే టాప్ ప్లేస్ లో నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు ఉంటాయి. వీరి నుంచి లభించే క్వాలిటీ వెబ్ కంటెంట్ చాలా ఎక్కువగాను ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఉంటుంది.

అందుకే వారికి ప్రపంచ వ్యాప్తంగా బిలియన్స్ లో సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ప్రైమ్ వీడియో వారు ఈ డిసెంబర్ లో కొత్తగా వారి రేట్లు పెంచేయడం స్టార్ట్ చేసి బ్యాడ్ న్యూస్ ఇస్తే వారికి షాక్ ఇచ్చేలా నెటిజన్స్ కి గుడ్ న్యూస్ ఇచ్చేలా నెట్ ఫ్లిక్స్ వారు తమ కొత్త ధరలు తగ్గించి గుడ్ న్యూస్ ఇచ్చారు.

ప్రైమ్ వీడియోలో నెల రోజులు ప్లాన్ సహా ఇయర్ ప్లాన్ ఇప్పుడు 999 నుంచి 1499 కి పెంచగా నెట్ ఫ్లిక్స్ వారు తమ 499 ప్లాన్ ని 199 కి తగ్గించి సూపర్ గుడ్ న్యూస్ అందించారు. దీనితో ఇప్పుడు ఈ ధరల పైనే సోషల్ మీడియాలో నెటిజన్స్ నడుమ చర్చ నడుస్తుంది. నెట్ ఫ్లిక్స్ కొత్త ప్లాన్ ధరలు అయితే ఇలా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :