ఈ రీమేక్‌లో చిరంజీవి సార్, చరణ్ నటిస్తే అద్భుతంగా ఉంటుంది – పృథ్వీరాజ్ సుకుమారన్!

ఈ రీమేక్‌లో చిరంజీవి సార్, చరణ్ నటిస్తే అద్భుతంగా ఉంటుంది – పృథ్వీరాజ్ సుకుమారన్!

Published on Mar 27, 2024 8:13 PM IST

సలార్ (Salaar) చిత్రం తో తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు టాలెంటెడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను మెప్పించిన ఈ హీరో, మరో ప్రత్యేకమైన చిత్రం ది గోట్ లైఫ్ (The Goat life) తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం పై హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తెలుగు లో ఆడు జీవితం పేరిట రిలీజ్ కానుంది.

తెలుగు ప్రమోషన్స్ సందర్భంగా, నటుడు చేసిన ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బ్రో డాడీ తెలుగు రీమేక్‌లో ఎవరిని చూడాలనుకుంటున్నారని ఇంటర్వ్యూయర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ని అడిగారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ యొక్క తెలుగు రీమేక్‌ లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌లను చూడటం తనకు చాలా ఇష్టమని నటుడు బదులిచ్చారు. పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ, బ్రో డాడీని తెలుగు ఇండస్ట్రీ రీమేక్ చేస్తుందో లేదో నాకు తెలియదు. అయితే ఈ రీమేక్‌లో చిరంజీవి సార్, చరణ్ నటిస్తే అద్భుతంగా ఉంటుంది అని అన్నారు.

బ్రో డాడీ లో మోహన్‌లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రీ కొడుకులుగా నటించారు. డైరెక్ట్ గా హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ చిత్రానికి పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి OTT ప్లాట్‌ఫారమ్‌లో అద్భుతమైన స్పందన లభించింది. అప్పటి నుండి, తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ నటిస్తారని పుకార్లు వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు