రోజా తనకు పోటీ కాదంటున్న సీనియర్ హీరోయిన్ !

రోజా తనకు పోటీ కాదంటున్న సీనియర్ హీరోయిన్ !

Published on Jul 25, 2019 1:03 AM IST

priya raman

ప్రజలకు సేవ చేసుకోవడం ద్వారానే వారి పై తనకున్న ప్రేమను వ్యక్తపరచగలనని అంటుంది సీనియర్ హీరోయిన్. వివరాల్లోకి వెళ్తే ప్రియా రామన్‌ తాజగా బీజేపీలో చేరారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మడం వల్లే తాను భాజపాలో చేరినట్టు వెల్లడించారు.

మోదీ అంటే తనకెంతో అభిమానమన్నారు. సత్యమూర్తిని కూడా తానెంతో గౌరవిస్తానని చెప్పారు. ఇలాంటి వారి నాయకత్వంలో దేశం, రాష్ట్రం ముందుకెళ్తాయని తనకు అన్పించడంవల్లే భాజపాలో చేరినట్టు ఆమె వివరణ ఇచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. రోజా నాకు మంచి ఫ్రెండ్….తామిద్దరం పోటీ దారులం కాదని.. భవిష్యత్తు కార్యక్రమాలు పార్టీ ఆదేశానుసారమే ఉంటాయని ప్రియా రామన్ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు