ప్రియమణి లీడ్ రోల్ లో పాన్ ఇండియా మూవీ గా సైనైడ్

Published on Oct 1, 2020 1:16 am IST


జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం సైనైడ్. మిడిల్ ఈస్ట్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రదీప్ నారాయణన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశంలోనే సంచలనం సృష్టించిన సైనైడ్ మోహన్ కేసు ఆధారం గా క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు తో పాటుగా, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే దక్షిణాది లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, హిందీ లో మాత్రం యశ్ పాల్ శర్మ ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, సైనైడ్ ఇచ్చి 20 మంది యువతులను కిరాతకంగా హత్య చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మోహన్ కేసు ను అత్యంత అరుదైన కేసు గా కోర్టు తీర్పు ఇచ్చింది అని అన్నారు.అయితే ఈ సంచలనాత్మక కేసు ప్రేరణ గా తీసుకొని ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నాము అని తెలిపారు. ప్రియమణి పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. అయితే పాన్ ఇండియన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత ప్రదీప్ నారాయణన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమాల్లో బిజీగా ఉన్న ప్రియమణి ఇందులో లీడ్ పాత్ర చేస్తున్నారు అని, అయితే దాదాపు 20 మంది యువతుల్లో ప్రేమను ప్రేరేపించి కర్ణాటక లోని వివిధ హోటల్ గదులలో వారితో శారీరక సుఖాలు అనుభవించి, ఆ తర్వాత గర్భ నిరోధక మాత్రల పేరిట సైనైడ్ ఇవ్వడం ద్వారా హత్య చేసి బంగారు ఆభరణాల తో బయటపడిన మోహన్ కథే సినిమా అని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 20 మంది అమ్మాయిలను కనికరం లేకుండా హత్య చేశాడు అని, అతనికి కోర్టు 6 మరణ శిక్షలు, 14 జీవిత ఖైదులను విధించింది అని, కేసు తుది తీర్పు కూడా వెలువడింది అని తెలిపారు. అయితే జనవరి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది అని, బెంగళూరు, మంగళూరు, కూర్గ్, మడిక్కేరి, గోవా, హైదరాబాద్, కాసరగొడ్ ప్రదేశాల్లో షూటింగ్ కొనసాగుతుంది అని అన్నారు.

సంబంధిత సమాచారం :

More