థ్రిల్లర్ జోనర్ లో ప్రియమణి !

Published on Feb 25, 2019 8:45 pm IST


ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏ ఎన్ బి కోర్డినేటర్స్ బ్యానర్ పై ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా రాబోతున్న సినిమా “సిరివెన్నెల”. కాగా ఈ చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త దూరమైంది. కాగా ప్రస్తుతం “సిరివెన్నెల” సినిమాతో రాబోతుంది.

కాగా ఈ చిత్రం టాకీ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది, ఇక ప్రస్తుతం రెండు సాంగ్స్ షూట్ మాత్రమే బాలన్స్ ఉంది. థ్రిల్లర్ జోనర్, కంప్లీట్ ఫ్యామిలీతో హ్యాపీగా చూసే సినిమాలా ఉంటుందట. ఇక మెయిన్ విలన్ గా కాలకేయ ప్రభాకర్ ఆక్ట్ చేస్తున్నాడు, మహానటి చైల్డ్ ఆర్టిస్ట్ ఈ మూవీ లో కీలక పాత్ర చేస్తుంది. ప్రియమణికి పర్ ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా సిరివెన్నెల ఉంటుందట.

సంబంధిత సమాచారం :