అఖిల్ 4 లో అనంతపురం బ్యూటీ ?

Published on Feb 26, 2019 2:22 pm IST

మిస్టర్ మజ్ను తరువాత యువహీరో అఖిల్ అక్కినేని తన నాల్గవ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో అఖిల్ కు జోడిగా ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ ను తీసుకుంటున్నారని ప్రచారంజరుగుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక సమాచారం వెలుబడాల్సి వుంది.

ఇక విజయ్ దేవరకొండ కు జోడిగా టాక్సీవాలా లో నటించిన ప్రియాంక ఈ చిత్రం తరువాత ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే ఇటీవల జరిగిన మీడియా ఇంట్రాక్షన్ లో ప్రస్తుతం తెలుగు, తమిళం లో నాలుగు ఆఫర్లు వున్నట్లు వెల్లడించింది. అందులో అఖిల్ సినిమా ఉందో లేదో అని తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :