ఇంటర్వ్యూ : ప్రియాంక జ‌వాల్క‌ర్‌ – ఫస్ట్ మీట్ లోనే బ‌న్నీగారి పై క్ర‌ష్ ఫామ్ అయింది.

ఇంటర్వ్యూ : ప్రియాంక జ‌వాల్క‌ర్‌ – ఫస్ట్ మీట్ లోనే బ‌న్నీగారి పై క్ర‌ష్ ఫామ్ అయింది.

Published on Nov 13, 2018 11:03 PM IST

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘టాక్సీవాలా’. ఈ సినిమా నవంబర్‌ 17న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ మీడియాతో ముచ్చ‌టించారు…

మీ గురించి చెప్పండి ?
నా పేరు ప్రియాంక‌. బేసిక‌ల్లీ నేను మ‌రాఠీ అమ్మాయిని.. కానీ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నాను. టాక్సీవాలా మూవీలో డెబ్యూ చేస్తున్నాను.

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌గారు ప్రీరిలీజ్‌లో మిమ్మ‌ల్ని అనంత‌పురం అమ్మాయి అన్నారు ఎలా ఫీల‌య్యారు?
చాలా హ్యాపీగా ఫీల‌య్యా. అనంత‌పురం నుంచి ఎవ‌రూ లేరు క‌దా.. అందుకే సెట్‌ లో వాళ్ళు అలా ఫీల‌వుతున్న‌ట్లున్నారు.

ఆఫ‌ర్ ఎలా వ‌చ్చింది?
నేను 2016లో యాక్టింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను బిక్షుగారి ద‌గ్గ‌ర‌. బిక్షుగారు, వాళ్ళ వైఫ్ వాళ్ళు యాక్టింగ్ ఇంట్లోనే నేర్పించేవారు, వాళ్ళ ద‌గ్గ‌రే నేర్చుకున్నాను. నాలుగు నెల‌లు కోచింగ్ తీసుకున్న త‌ర్వాత నా ఫోటోస్ ని గీతాఆర్ట్స్‌కి పంపించాను. వాళ్ళు న‌న్ను పిలిపించి ఆడిష‌న్ ఇవ్వండి అన్నారు. ఆడిష‌న్ ఇచ్చాక నన్ను ఈ సినిమాకి ఎంపిక చేశారు.

ఇంత‌క ముందు ఏమి చేశారు?

షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అవి చేసి ఐదు ఏళ్ళు అవుతుంది. అందులో పొసెసివ్‌నెస్ అనే షార్ట్ ఫిల్మ్ బాగా వైర‌ల్ అయింది. ఎం.ఆర్ ప్రొడ‌క్ష‌న్‌లో చేశాను. చిన్న‌ప్ప‌టినుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. నేను ఇంజ‌నీరింగ్ ఫైన‌లియ‌ర్ చేస్తున్న‌ప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వస్తే చేశాను.

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించ‌డం ఎలా అనిపించింది?
విజ‌య్‌తో చాలా కూల్ ప‌ర్స‌న్‌. త‌ను చాలా మంచి పెర్‌ఫార్మ‌ర్ యాక్టింగ్ బేసిస్‌ ఆయ‌న వ‌ల్ల నాకు యాక్టింగ్ స్కిల్స్‌ పెరిగాయి. ఒక సీన్ ని ఎన్నిసార్లు ఎన‌లైజ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నీ చెప్పేవారు. తనతో చెయ్యడం చెయ్య‌డం బావుంది.

ఈ సినిమా పెద్ద బ్యాన‌ర్ అని ఒప్పుకున్నారా ?
డెబ్యూ మూవీకి బ్యాన‌ర్ చూసుకోవ‌డ‌మేంటండి. ఆఫ‌ర్ రావ‌డ‌మే గొప్ప. ఫ‌స్ట్ ఆఫ‌ర్ కోసం ఎవ‌రైన ఎదురు చూస్తాం క‌దా. చాలా మంది ఇదే అడుగుతున్నారు. సెకండ్ మూవీకి అవ‌న్నీ చూస్తానేమోకాని ఫ‌స్ట్ మూవీ ముందు నాకు చాన్స్ కావాలి క‌దా.

అంద‌రూ మిమ్మ‌ల్ని తెలుగమ్మాయి అంటున్నారు? ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది వ‌చ్చినా అంత‌గా క్లిక్ అవ్వ‌లేదు? మరి ఏ విధంగా క్లిక్ అవ్వ‌గ‌ల‌ను అనుకుంటున్నారు?
ప్ర‌జ‌ర్ అనిపించ‌డంలేదు కాని, ఆర్ట్ ఈజ్ ఆర్ట్. ఒక పెయింటింగ్ ఉందంటే దాన్ని త‌మిళ ఆర్టిస్ట్ వేసినా, తెలుగు ఆర్టిస్ట్ వేసినా ఆర్ట్ ఆర్టే క‌దా యాక్టింగ్ కూడా అంతే. నాకు సంబంధించినంత వ‌ర‌కు. ఎవ‌రు చేసిన అవుట్ పుట్ అనేది బావుండాలి. బ‌ట్ తెలుగ‌మ్మాయిలు ఎక్కువ వ‌స్తే బావుంటుంది. డైరెక్ట‌ర్‌కి కూడా ఒక అవ‌గాహ‌న ఉంటుంది క‌దా. ఎవ‌రు క్యారెక్ట‌ర్‌కి బాగా ఫిట్ అవుతారో వారినే పెట్టుకుంటారు.

అవ‌కాశం వ‌చ్చిన త‌ర్వాత పేరెంట్స్ కి ఎలా చెప్పారు? ఏమ‌న్నారు ?

నేను ముందుగానే ఎవ‌రికీ చెప్ప‌లేదండీ. ఎందుకంటే ఒన్ వీక్ త‌ర్వాత మ‌ళ్ళీ తీసేస్తారేమో అని చిన్న టెన్ష‌న్ ఉండేది. ఎక్క‌డ న‌న్ను తీసేస్తారో ఇంట్లో చెప్పుకుంటే నేను ఎక్క‌డ బిస్కెట్ అయిపోతానో అని చాలా భ‌యం ఉండేది, అందుకే చెప్ప‌లేదు. రెండు మూడు వారాలు అయిన త‌ర్వాత న‌న్ను తియ్య‌రు అని నాకు న‌మ్మ‌కం వ‌చ్చిన త‌ర్వాత చెప్పాను. మా అమ్మ‌కి చెప్పా అవ‌కాశం వ‌చ్చింది అని. జాగ్ర‌త్త‌గా చెయి మంచిగా యాక్ట్ చెయ్యి అంది.

ఈ రెండేళ్ళ‌లో మీకు వేరే అవ‌కాశాలు రాలేదా?
ఆఫ‌ర్స్ వ‌చ్చాయి కాని నేను ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో రాలేదు. బ‌హుశా ఈ సినిమా విడుద‌ల‌య్యాక వ‌స్తాయేమో. ఒక డైరెక్ట‌ర్ కూడా ఒక హీరోయిన్‌ను తీసుకోవాలంటే స్క్రీన్ మీద ఎలా ఉన్నాము, మార్కెట్ వాల్యూ ఇవ‌న్నీ కూడా చూస్తారు క‌దా.

ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ గురించి?
ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు అను. జూనియ‌ర్ డాక్ట‌ర్ రోల్ లో చేశాను.

ప్రీరిలీజ్‌లోనే బ‌న్నీ గారిని క‌లిశారా ఇంత‌కు ముందే క‌లిశారా?
నేను టెస్ట్ ఇచ్చేట‌ప్పుడు ఒక్క‌సారి వ‌చ్చి ఆల్ ద బెస్ట్ చెప్పివెళ్లారు. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ రెండేళ్ళు క‌ల‌వ‌లేదు.

ఆయ‌న పైన క్ర‌ష్ ఉంద‌న్నారు? ఎప్పటినుంచీ ?
ఫ‌స్ట్ టైం మీట్ అయ్యాక క్ర‌ష్ ఫామ్ అయింది. ఆయ‌న చూసి వెళ్లిపోయాక అనిపించింది.

రాహుల్ డైరెక్ట‌ర్ గురించి చెప్పండి?
ఆయ‌న ప‌ర్ఫెక్ష‌న్‌కి నేనే ఎక్కువ బ‌ల‌య్యాను. ప్ర‌తీ చిన్నది కూడా ప‌ర్ఫెక్ట్‌గా కావాలంటారు ఆయ‌న‌. కానీ ఎప్పుడూ ఒక్క‌రోజు కూడా టెంప‌ర్‌ గా లేరు. చాలా కూల్‌గా ఉండేవారు, కూల్‌గా చెప్పేవారు. టైం ఇస్తూ, స్పేస్ ఇస్తూ, డైలాగ్స్ అన్నీ ముందు రోజే చెపుతూ చెయించుకునేవారు.

మీకు ఫ్యూచ‌ర్‌లో చెయ్యాల‌నిపించే జోన‌ర్ ఏదైనా ఉందా?
అలా ఏమీ లేదండి. ప్ర‌స్తుతం అవ‌కాశాలు రావాలి మొయిన్ అంతే. ఏదైనా స‌రే ఒక మంచి సినిమాలో పార్ట్ అయితే చాలు. నేను ఏ సినిమాలో ఉన్నా ఆ సినిమా జ‌నాల‌కి న‌చ్చితే అదే చాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు