అఖిల్ 4 లో హీరోయిన్ ఆమె కాదట !

Published on Feb 27, 2019 9:31 pm IST

వరుసగా మూడు పరాజయాల తరువాత యువ హీరో అఖిల్ అక్కినేని తన కొత్త చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలో వుంది. అయితే అప్పుడే ఈ సినిమాకు హీరోయిన్ ఖరారు అయిపోయిందని వార్తలు వచ్చాయి. విషయానికి వస్తే ఈచిత్రంలో అఖిల్ కు జోడీగా అనంతపురం బ్యూటీ , టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఇవి కేవలం రూమర్లు మాత్రమేనని తెలుస్తుంది.

అసలు ఇంకా ఈ చిత్రానికి హీరోయిన్ ను ఎంపిక చేసే పక్రియే స్టార్ట్ కాలేదట. స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడట భాస్కర్. గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రం సమ్మర్ లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :