మొదటిసారిగా కేన్స్ ఫెస్టివల్ లో పాల్గొననున్న ప్రియాంకా

Published on May 15, 2019 12:27 pm IST

ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మొదటిసారిగా పాల్గొననుంది. ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ బాలీవుడ్ కి చెందిన అందాల తారలు అదిరే డ్రెస్సులతో అందాల ప్రదర్శన కి ఎంతో పేరుగాంచిన ఈ ఫెస్టివల్లో పాల్గొనడం తారలు అరుదైన గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే ఐశ్వర్యారాయ్,కత్రినా ఖైఫ్, కరీనా కపూర్ వంటి తారలు కేన్స్ ఫెస్టివల్లో సందడి చేయగా మొదటిసారి ఆవకాశాన్ని దక్కించుకుంది.

ఇటీవల జరిగిన మెట్ గాలా ఫెస్ట్ లో మంత్రగత్తె లాంటి ఓ విచిత్ర వేషధారణలో కనిపించిన ప్రియాంకా ను నెటిజన్స్ ఓ రేంజ్ ఆడుకున్నారు. ఈ తరుణంలో ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ లో ప్రియాంక ఎటువంటి డ్రెస్సులో మెరవనుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక తో పాటుగా బాలీవుడ్ అందాల తారలు ఐశ్వర్య రాయ్,దీపికా పదుకొనె , సోనమ్, కత్రినా ఖైఫ్, హుమా కుర్దేశ్ కేన్స్ లో సందడి చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More