‘భారతీయుడు 2’ నుండి ఆ హీరోయిన్ కూడా !

Published on Aug 23, 2019 2:05 am IST

శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు సీక్వెల్‌ కు మధ్యలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ బ్రేక్ ఇచ్చినా.. మళ్ళీ ఎట్టకేలకూ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఇచ్చిన బ‌డ్జెట్ ప‌రిమితుల్లోనే, శంకర్ సినిమా చెయ్యడానికి అంగీకరించడంతో సినిమా మళ్లీ మొదలైంది. అయితే ముందు అనుకున్న నటీనటులు మాత్రం డేట్లు ఎడ్జిస్ట్ అవ్వక సినిమాకి గుడ్ బై చెప్పేస్తున్నారు కాగా తాజాగా టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్‌ ఈ సినిమా నుండి డేట్లు కుదరక తప్పుకున్నట్లు తెలిపింది.

ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2020లో ఈ సినిమా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :