బాలయ్య కొత్త సినిమాను ప్రకటించిన నిర్మాత !

బాలకృష్ణ, తేజ కాంబినేషన్ లో రూపొందే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఈ నెల 29 న రామకృష్ణ స్టూడియో లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఈ సినిమాతో పాటు బాలయ్య మరో సినిమా చెయ్యబోతున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే…

బాలయ్యతో జై సింహ సినిమాను నిర్మించిన సి. కళ్యాణ్ మరిసారి బాలయ్యతో మూవీ నిర్మించబోతున్నాడు. వివి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమాను మే 27 న ప్రారంభం కానుందని మీడియాతో సి’.కళ్యాణ్ చెప్పారు. గతంలో వినాయక్, బాలయ్య కాంబినేషన్ లో చెన్నకేశవ రెడ్డి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ సినిమాకి సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.