ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : బెక్కెం వేణుగోపాల్ – ‘హుషారు’ పక్కా పైసా వసూల్ మూవీ !

Published on Nov 27, 2018 6:31 pm IST

నూతన దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘హుషారు’. యూత్ కి కనెక్ట్ అంశాలతో ట్రెండీగా రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన విడుదల అవ్వనుంది. ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం

‘హుషారు’ విడుదల తేదీ దగ్గర పడుతుంది. హుషారుగా ఉందా ? టెన్షన్ గా ఉందా ?

సినిమా తీసే అందరికీ టెన్షన్ ఉంటుంది అండి. కాకపోతే అందరికీ రిలీజ్ తరువాత కూడా టెన్షన్ ఉంటే, నాకు మాత్రం రిలీజ్ వరకే టెన్షన్ ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి అది కూడా చాలా పాజిటివ్ టెన్షన్. సినిమాకి పబ్లసిటీ బాగా జరగాలి, జనంలోకి బాగా వెళ్ళాలి అనే విషయాల్లోనే టెన్షన్ ఉంటుంది.

అసలు ఈ ‘హుషారు’ ఎలా మొదలైయింది ?

రాజుగారితో ‘నేను లోకల్’ చేసిన తరువాత ఆ సినిమా పెద్ద హిట్ అయింది. నెక్స్ట్ ఇంక ఏం చేద్దాం ఎలాంటి సినిమా చేద్దాం అని రకరకాల కథలు వింటున్న టైంలో.. శ్రీహర్ష వచ్చి ఈ కథ చెప్పాడు. కథ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. ఆ తరువాత టెస్ట్ షూట్ లు, ఆర్టిస్ట్ ల సెలెక్షన్స్ వాళ్ళను మౌల్డ్ చేసుకోవటం ఇలా అన్ని రకాలుగా సరిచేసుకొని ఈ సినిమా స్టార్ట్ చేశాము.

‘హుషారు’ దర్శకుడు శ్రీ హర్షకు అంతకుముందు ఫిల్మ్ మేకింగ్ లో ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లేదు. అయినా మీరు అతన్ని ఎలా బిలీవ్ చేశారు ?

ఎక్స్ పీరియన్స్ లేకపోయినా చాలా కామెన్ సెన్స్ ఉంది. తను కథ చెప్పిన విధానంలోనే నాకు తనేంటో అర్ధం అయిపోయింది. విజువల్ గా తను అనుకున్న సీన్ ని కన్వెన్స్ చెయ్యగలడు అనిపించింది. ఇక ఒక డైరెక్టర్ టేస్ట్ ఏంటో అతను రాసుకున్న స్క్రిప్ట్ లోనే తెలిసిపోతుంది. ఆ రకంగా చుస్తే హర్షకి మంచి టేస్ట్ ఉంది, మంచి విజన్ ఉంది, అందుకే అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాను. చెప్పినట్లుగానే సినిమాని చాలా ట్రెండీగా తెరకెక్కించాడు.

మిమల్ని ఈ సినిమాలో బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఆ ట్రెండీనెసేనా ?

అంతకుమించి ఈ సినిమాలో మంచి కథ ఉంది అండి. ఫ్రెండ్స్ మధ్య సన్నివేశాలు కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలాగే నచ్చింది చెయ్యండి, ఎవరికి ఇష్టమైన పనిని వాళ్ళు చెయ్యండి అనే మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఈ అంశాలను చెప్పిన విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి సీన్ చాలా నాచ్యురల్ గా ఉంటుంది.

డైరెక్టర్ మీ ఎక్స్ పెటేషన్స్ రీచ్ అయ్యాడా ?

బాగా చేసాడు అండి. తను నా దగ్గరికి వచ్చినప్పుడే పూర్తి స్క్రిప్ట్ తో వచ్చాడు. సాంగ్స్ దగ్గర నుంచి ఆర్.ఆర్ వరకు అన్ని దగ్గర ఉండి తన విజన్ కి తగ్గట్లు తనకి నచ్చినట్లు చేయించుకున్నాడు. ఈ సినిమా టోటల్ డైరెక్టర్ సినిమా.

కథ విన్నప్పుడు మీకు కలిగిన అనుభూతికి, మీరు సినిమా చూసిన తరువాత మీకు కలిగిన అనుభూతికి మ్యాచ్ అయిందా ? లేక అవుట్ ఫుట్ ఇంకా బెటర్ గా వచ్చిందా ?

చాలా బెటర్ గా వచ్చింది. ఫస్ట్ వేరే కెమెరామేన్ పెట్టి కొన్ని సీన్స్ తీసారు. బట్ అవి నాకు అస్సలు నచ్చలేదు. ఆ తరువాత అర్జున్ రెడ్డి కెమెరామేన్ రాజ్ తోటను తీసుకొచ్చి షూట్ చేశాము. సినిమా అంత చాలా రీచ్ గా ఉందంటే దానికి కారణం రాజ్ తోటనే. తను చాలా బాగా చేశాడు. బడ్జెక్ట్ పరంగా కూడా ముందు అనుకున్న దానికంటే పెరిగింది. అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా అవుట్ ఫుట్ బాగా రావాలి ఆలోచనతోనే ముందుకు వెళ్ళాం. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది.

‘హుషారు’ ఆడియో సూపర్ హిట్ అయింది. మరీ సినిమాకి ఆ స్థాయిలో బజ్ వచ్చింది అంటారా ?

ఇప్పటివరకు ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్స్, టీజర్ మరియు ట్రైలర్ ఇలా ప్రతి దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వారి రెస్పాన్స్ కి తగ్గట్లుగానే సినిమాలో ఫ్రెష్ నెస్ ఉంది. అందుకే ఈ సినిమా హిట్ అవుతుందని మా టీం అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.

సూపర్ హిట్ ఆడియోను ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ రథన్ గురించి చెప్పండి.

రథన్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ కావొచ్చు అంతకుముందు సినిమాలు కావొచ్చు ఇలా తన మ్యూజిక్ అంటే నాకు బాగా ఇష్టం. డైరెక్టర్ తన పేరు చెప్పిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ గా తననే ఫిక్స్ అయిపోయాం. ఈ సినిమా కోసం తను చాలా ట్యూన్స్ ఇచ్చాడు. తన ఆల్బమ్ సూపర్ హిట్. తనతో పని చెయ్యడం నాకు చాలా ఇష్టం.

మీరు ఒకపక్క ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూ దిల్ రాజూ గారి దగ్గర ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చెయ్యడం ఎలా అనిపిస్తోంది.

నేను లోకల్ సినిమాకి నేను అసోసియేట్ ప్రొడ్యూసర్ గా చేశాను. దిల్ రాజుగారి దగ్గర పని చెయ్యడం అనేది నాకు చాలా నాలెడ్జ్ తో పాటు చాలా సంతోషాన్ని ఇస్తోంది. అయినా, వేరే వాళ్ళ దగ్గర పని చెయ్యడం వేరు, దిల్ రాజుగారి దగ్గర పని చెయ్యడం వేరు.

హుషారు సినిమా గురించి చెప్పండి ?

‘హుషారు’ చాల క్రేజీ క్రేజీ మూవీ. ప్రధానంగా యూత్ కి కనెక్ట్ అంశాలతో ఈ సినిమా సాగుతుంది. అలాగే కథా కథనాలు కూడా చాలా ఇన్నోవేటివ్ గా , ట్రెండీగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘హుషారు’ పక్కా పైసా వసూల్ మూవీ.

మీ తదుపరి ప్రాజెక్ట్ లు ఏమిటి ?

డైరెక్టర్ త్రినాధ్ నక్కినతో ఒక సినిమా ఉంటుంది. అలాగే మరో రెండు సినిమాలు ఉన్నాయి. దిల్ రాజుగారి అసోసియేషన్ లో కూడా ఒక సినిమా అనుకుంటున్నాం.

సంబంధిత సమాచారం :

X
More