సూపర్ స్టార్ సినిమాతో సంబంధం లేదన్న నిర్మాత !

Published on Dec 20, 2018 8:41 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెట్టా’. అయితే ఈ చిత్రం తెలుగు హక్కులను సి.కళ్యాణ్ తీసుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమా రైట్స్ కి, తనకి ఎలాంటి సంబంధం లేదనే సి.కళ్యాణ్ స్పష్టం చేసాడు.

సి.కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తనకెంతో గౌరవమని, సూపర్ స్టార్ తో సినిమా చేయాలని ప్రతి నిర్మాతకు ఉంటుందని.. కాకపోతే ఈ చిత్రం రైట్స్ విషయంలో వస్తోన్న వార్తలు మాత్రం పూర్తి అసత్యం అని చెప్పారు.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, త్రిష, నవాజుద్దిన్ సిద్దిఖీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :