ఐటీ రైడ్స్ ను లైట్ తీసుకున్న దిల్ రాజు !

Published on May 8, 2019 6:08 pm IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో రేపు అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న ‘మహర్షి’ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయం పై ఈ రోజు ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

కాగా ఈ సోదాల పై నిర్మాత దిల్ రాజు తన సన్నిహితల దగ్గర స్పందిస్తూ..’భారీ అంచనాలు ఉన్న ఇలాంటి పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సహజంగానే ఇలాంటి రైడ్స్ జరుగుతాయని.. వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు మూడు వేర్వేరు పాత్రల్లో మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తోనూ వెరీ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

ఇక మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో పాటు అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నట్లు అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోనైనా ఈ కామెడీ హీరో హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More