మహేష్ భారీ సినిమా అప్డేట్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాత.!

Published on Jun 10, 2022 11:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా అయినటువంటి “సర్కారు వారి పాట” చిత్రం మహేష్ కెరీర్ లో మరో మంచి హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మహేష్ ఈ సినిమా తర్వాత తన మ్యాజికల్ దర్శకుడు త్రివిక్రమ్ తో దాదాపు దశాబ్ద కాలం తర్వాత చేస్తున్న సినిమాపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

అయితే గత కొంత కాలం నుంచి ఈ సినిమా అప్డేట్ కోసం మహేష్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ అప్డేట్ పై నిర్మాత నాగవంశీ లేటెస్ట్ గా ఒక సాలిడ్ క్లారిటీ ని అందించారు. అభిమానుల ఆత్రుత అర్ధం చేసుకోగలం అని కానీ ఏదైనా సరే సమయం వచ్చినప్పుడే చెబితే శ్రేయస్కరంగా ఉంటుందని తాము భావిస్తున్నామని.

అందుకే ఎప్పుడు పడితే అప్పుడు అప్డేట్స్ అందించలేమని దాదాపు 12 ఏళ్ళు తర్వాత మహేష్ గారు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు అలంటి సినిమాకి ప్రతీది స్పెషల్ గానే ఉండాలి అందుకే ఆ అప్డేట్స్ ని స్పెషల్ డే కి ప్లాన్ చేసి రిలీజ్ చేస్తామని ఖచ్చితంగా ఈ చిత్రం అందరికీ ఒక మరపురాని సినిమాగా నిలుస్తుంది అని తెలిపారు.

సంబంధిత సమాచారం :