“శత్రుపురం” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన నాంది చిత్ర నిర్మాత

“శత్రుపురం” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన నాంది చిత్ర నిర్మాత

Published on Aug 12, 2021 10:00 AM IST

producer

జీవన్, మధుప్రియ హీరో హీరోయిన్ లుగా సోమ సుందరం దర్శకత్వం లో వాయుపుత్ర ఆర్ట్స్ పతాకంపై పుష్పాలత.బి నిర్మిస్తున్న చిత్రం శత్రుపురం. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రం ను సెప్టెంబర్ లో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తాజాగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో నాంది చిత్రం నిర్మాత సతీష్ వర్మ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో సతీష్ వర్మ మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇందులోని సీన్స్, లోకేషన్స్ నేచురల్ గా ఉన్నాయని అన్నారు. రియలిస్టిక్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం నాంది కంటే పెద్ద హిట్ కావాలని, దర్శక నిర్మాతలకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అని అన్నారు.

ఈ చిత్రం హీరో జీవన్ మాట్లాడుతూ, పెద్ద హీరో కోసం రాసుకున్న కథ తో సోమ సుందరం సినిమా తీశారని, ప్రతీ ఒక్కరూ కష్టపడి కాకుండా ప్రాణం పెట్టీ సినిమా చేశారని అన్నారు. అయితే ఇది తన రెండవ చిత్రం అంటూ చెప్పుకొచ్చారు.ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అని,అందరికీ నచ్చుతుంది అని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలి అంటూ చెప్పుకొచ్చారు.

చిత్ర దర్శకుడు సోమ సుందరం మాట్లాడుతూ, నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేసినట్లు తెలిపారు. ఒక ఊరిలో పైకి మంచిగా నటిస్తూ, ఎవరికీ తెలీకుండా అక్రమాలు, అరాచకాలు సృష్టిస్తూ, అతి భయంకరం గా హత్యలు చేస్తున్న ముగ్గురు దుర్మార్గులను హీరో పసిగట్టి వారిని ఎలా హతమార్చాడు అనేది ఈ చిత్రం మెయిన్ కాన్సెప్ట్ అని అన్నారు. సినిమా బాగా వచ్చిందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు.

తాజా వార్తలు