తమ్మారెడ్డి భరద్వాజకి మాతృ వియోగం !

తమ్మారెడ్డి భరద్వాజకి మాతృ వియోగం !

Published on Apr 7, 2020 7:04 AM IST

tammareddy

ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కృష్ణవేణి (94) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. వయసు పై బడటం కారణంగా ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. రవీంద్ర ఆర్ట్స్‌ పతాకంపై ‘లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్‌ బాబు’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించిన దిగ్గజ నిర్మాత కృష్ణమూర్తి సతీమణి కృష్ణవేణి.

కృష్ణమూర్తి – కృష్ణవేణి. దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు లెనిన్‌ బాబు చనిపోయారు. ఈ సంఘటనతో తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 123తెలుగు.కామ్ తరఫున కృష్ణవేణిగారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

తాజా వార్తలు