మహేష్ “మహర్షి” ని హిందీలో సల్మాన్ ఖాన్ చేయనున్నాడా?

Published on May 18, 2019 2:30 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాలను రీమేక్ చేయడం లో ఎప్పుడూ ముందుంటారు. ఆయన తన మొత్తం కెరీర్లో 10 పైగా సౌత్ మూవీస్ రీమేక్స్ లో నటించివుంటారు. తెలుగు లో వచ్చిన “రెడీ” “కిక్” లతో పాటు మహేష్- పూరి కంబినేషన్లో వచ్చిన “పోకిరి” మూవీ రీమేక్ లో కూడా సల్మాన్ ఖాన్ నటించడం జరిగింది.2009 లో వచ్చిన పోకిరి రీమేక్ “వాంటెడ్” సల్మాన్ ఖాన్ ని అపజయాలనుండి బయటపడేసి మళ్ళీ విజయాల బాట పట్టించింది.

ఐతే ప్రస్తుతం విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న మహేష్ , వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన “మహర్షి” మూవీని హిందీలో సల్మాన్ ఖాన్ తో చేయించాలని నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారంట . మొదట మూవీని సల్మాన్ కి చూపించి ఆయన ఓకే చేస్తే రీమేక్ పనులు మొదలుపెట్టే యోచనలో ఉన్నారంట నిర్మాతలు. కాబట్టి తనకు అచ్చోచ్చిన రీమేక్ సంప్రదాయంతో బాలీవుడ్ లో సల్మాన్ మరో బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More