చైనా వెళ్లనున్న సమంత “ఓ బేబీ”

Published on Jul 14, 2019 9:00 pm IST

లేడి డైరెక్టర్ నందిని రెడ్డి సమంతల కాంబినేషన్ లో వచ్చిన “ఓ బేబీ” మూవీ ఇటీవల విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. కామెడీ,ఎమోషన్స్ ని చక్కగా మిక్స్ చేసి తీసిన “ఓ బేబీ” మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత నటన,డైరెక్టర్ టేకింగ్ కి మంచి మార్కులు పడ్డాయి.తెలుగు ప్రేక్షకులు అందించిన స్పూర్తితో “ఓ బేబీ” చిత్రాన్ని చైనా లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్మాతలు ప్రకటించడం జరిగింది. అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థలతో త్వరలో చర్చించి విడుదల తేదీ ప్రకటిస్తారట.

గతంలో రాజమౌళి విజువల్ వండర్స్ ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించినా చైనాలో మాత్రం ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయాయి. మరి “ఓ బేబీ” అక్కడ ఎంత మేరకు విజయం సాధిస్తుందో చూడాలి మరి. కథా ప్రాధాన్యంతో పాటు,ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీస్ చైనాలో మంచి ఆదరణ పొందుతాయి. ఆవిధంగా “ఓ బేబీ” చైనీయులకు నచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అమిర్ ఖాన్ ‘దంగల్’ మూవీ చైనాలో రికార్డు కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More